Sat Oct 12 2024 15:57:24 GMT+0000 (Coordinated Universal Time)
సైనా కు బహిరంగంగా క్షమాపణ చెప్పిన హీరో సిద్ధార్థ్
సినీ హీరో సిద్ధార్థ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా.. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ అయిన సైనా నెహ్వాల్ పై చేసిన ఓ కామెంట్ పై
సినీ హీరో సిద్ధార్థ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా.. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ అయిన సైనా నెహ్వాల్ పై చేసిన ఓ కామెంట్ పై పెద్ద దుమారమే రేగింది. ఆ కామెంట్ చూసి.. సైనా నెహ్వాల్ తల్లిదండ్రులు సైతం ఎంతో బాధపడ్డారు. సిద్ధార్థ్ సైనా కు క్షమాపణ చెప్పాలంటూ.. నెటిజన్లు తీవ్రంగా డిమాండ్ చేయడంతో.. సిద్ధార్థ్ సైనాకు బహిరంగ క్షమాపణ చెప్పాడు.
Also Read : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత
అసలేం జరిగిందంటే.. ఇటీవల ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతాలోపాన్ని ప్రస్తావించింది సైనా. దేశ ప్రధానికే భద్రత లేకపోతే.. ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోడీపై అరాచకవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ ను రీట్వీట్ చేసిన సిద్ధార్థ్.. చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారు.. అంటూ కామెంట్ చేయడంతో అసలు వివాదం మొదలైంది.
సైనా పై సిద్ధార్థ్ అలా కామెంట్ చేయడంతో.. జాతీయ మహిళా కమిషన్, కొందరు ప్రముఖులు, చివరకు సైనా తండ్రి హర్వీర్ సింగ్ నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిద్ధార్థ్ సైనా కు బహిరంగంగా క్షమాపణలు చెప్తూ ఓ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సైనా పై తాను చేసిన కామెంట్ ఒక జోక్ మాత్రమేనని.. అది చాలామందిని బాధించిందని పేర్కొన్నారు. మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. " సైనా నెహ్వాల్ ఓ గొప్ప క్రీడాకారిణి, ఆమెను ఎప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నాడు.. నువ్వు ఎప్పుడూ నాకు ఛాంపియన్‌గా ఉంటావు" అని పేర్కొన్నారు.
Next Story