Tue Jan 20 2026 14:14:28 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీని వణికిస్తోన్న వైరస్.. ఎమ్మెల్యే శిల్పాచక్రపాణికి పాజిటివ్
ఇప్పటికే మంత్రి కొడాలి నాని కి పాజిటివ్ గా నిర్థారణ అవ్వగా.. తాజాగా పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వైరస్ బారిన పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ క్రమంగా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. ఎవ్వరినీ వదలడం లేదు మాయదారి వైరస్. సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు ఇలా.. ఒక్కరేంటి.. ఇప్పటికే చాలామంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు ఏపీ అధికార ప్రభుత్వాన్ని వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే మంత్రి కొడాలి నాని కి పాజిటివ్ గా నిర్థారణ అవ్వగా.. తాజాగా పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వైరస్ బారిన పడ్డారు.
Also Read : కొడాలి, వంగవీటికి కరోనా పాజిటివ్
కర్నూల్ జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి కరోనా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఇటీవల ఆయనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని, హోం ఐసోలేషన్ లో ఉండాలని చక్రపాణి విజ్ఞప్తి చేశారు.
News Summary - Srisailam YSRCP MLA Silpa Chakrapani Tested Covid Positive
Next Story

