Mon Dec 09 2024 05:05:49 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. మంగళవారం కరోనా పరీక్షలు
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. మంగళవారం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ గా తేలిందని గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం తన ఆరోగ్యం ఫర్వాలేదని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. అలాగే ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వీలైనంత వరకూ ఇంట్లోనే సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించండి. మాస్క్ ను ధరించి, భౌతిత దూరం పాటించండి అని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. కాగా.. గౌతమ్ గంభీర్ 2022 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్ ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ఉన్నారు.
Next Story