Wed Dec 17 2025 14:15:30 GMT+0000 (Coordinated Universal Time)
సర్కారువారి పాట మళ్లీ వాయిదా ?
సర్కారు వారిపాట లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. పోస్ట్ ప్రొడక్షన్స్ కి కూడా టైం పడుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైనా..

సర్కారు వారి పాటకు ఈ ఏడాది పెద్దగా కలిసొచ్చినట్లు లేదు. ఒక్క సర్కారు వారి పాటేంటి.. సంక్రాంతికి రావాలనుకున్న ఏ సినిమాకు కలిసిరాలేదు. ఆఖరికి పాన్ ఇండియా సినిమాలు కూడా కరోనా ధాటికి విడుదల వేసుకోక తప్పలేదు. జనవరిలో రావాల్సిన సినిమాలు కొన్ని.. ఫిబ్రవరికి వాయిదా పడ్డాయి. ఫిబ్రవరిలోనూ కరోనా తీవ్రత తగ్గేలా లేకపోవడంతో ఇప్పటికే ఆచార్య వాయిదా పడింది. ఫిబ్రవరి 25వ తేదీన భీమ్లా నాయక్ రావాల్సి ఉంది. అదికూడా వస్తుందో లేదో డౌటే.
Also Read : అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం.. ఎలా జరిగింది ?
చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య.. ఉగాది విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 1వ తేదీన ఆచార్యను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే నెలలో సర్కారు వారి పాట కూడా విడుదలకానుంది. దీంతో మరో రెండు పెద్ద సినిమాలకు క్లాష్ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. కాగా.. సర్కారు వారిపాట లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. పోస్ట్ ప్రొడక్షన్స్ కి కూడా టై పడుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలైనా.. విడుదల సమయానికి అన్నీ పూర్తిచేయడం కష్టం. అందుకే సర్కారువారిపాటను ఆగస్టుకు వాయిదా వేసినట్లు సమాచారం. ఆగస్టులో మహేష్ బర్త్ డే రోజు సర్కారు వారిపాట విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story

