Mon Sep 09 2024 12:47:53 GMT+0000 (Coordinated Universal Time)
అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం.. ఎలా జరిగింది ?
రాజేంద్ర నగర్ లోని ఓ అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం హైదర్ గూడలోని ఇష్తా సిటీ అపార్ట్ మెంట్ లో
రాజేంద్ర నగర్ లోని ఓ అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం హైదర్ గూడలోని ఇష్తా సిటీ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లాట్ నంబర్ 521లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లాట్ లో నుంచి అగ్నికీలలు ఎగసి పడటం చూసిన అపార్ట్ మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : సచిన్ జోషికి ఈడీ షాక్.. ఆస్తులు జప్తు
షార్ట్ సర్కూట్ కారణంగా అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. పోలీసులు.. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం వల్ల భవనం పూర్తిగా దగ్ధమవ్వగా.. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినట్లు సమాచారం.
Next Story