Thu Mar 19 2026 05:49:07 GMT+0530 (India Standard Time)
బాబాయ్ ట్రైలర్ పై అబ్బాయ్ రివ్యూ !
తాజాగా మెగా హీరో రామ్ చరణ్.. తన బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ పై స్పందించారు. ట్రైలర్ పై ట్విట్టర్..

పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్ లో వస్తోన్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా మరో రెండ్రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ పోలీస్ గా వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెట్టింట్లో భీమ్లా ట్రైలర్ మేనియానే కొనసాగుతోంది. పవన్, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నాయి.
తాజాగా మెగా హీరో రామ్ చరణ్.. తన బాబాయ్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ పై స్పందించారు. ట్రైలర్ పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. "భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది. ట్రైలర్‌లోని ప్రతీ డైలాగ్, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ పవర్ ఫుల్‌గా ఉంది. ఇక నా స్నేహితుడు రానా దగ్గుబాటి నటన సూపర్‌గా ఉంది. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్" అంటూ ట్వీట్ చేశాడు. కాగా.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.
News Summary - Ram Charan Review on Bheemla Nayak Trailer
Next Story

