Fri Sep 13 2024 14:09:36 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమోన్మాది ఘాతుకం.. కన్నతల్లి ముందే యువతి గొంతుకోసి దారుణ హత్య
గుజరాత్ : ప్రేమకి అర్థం తెలియని వయస్సు నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటూ.. యువతుల వెనక పడటం, ఒప్పుకోక పోతే బెదిరించడం, అయినా వినకపోతే చంపేయడం. ఇప్పుడు ప్రేమ అంటే ఇలాగే ఉంది. రోజులు గడిచే కొద్ది ప్రేమ అనే పదానికి అర్థాలు మారిపోతున్నాయి. పలువురు ప్రాణాలు తీసేందుకు, తీసుకునేందుకు ప్రేమే కారణం అవ్వడం బాధాకరం. ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యువతి కన్నతల్లి ముందే గొంతుకోసి హతమార్చాడు ఆ సైకో. ఈ దారుణ ఘటన ఈనెల 12వ తేదీన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన గ్రీష్మా వెకారియా (21) హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తన పెళ్లి ప్రపోజల్ ను అంగీకరించాలంటూ ఫెనిల్ గొయాని అనే యువకుడు గ్రీష్మా ను తరచూ వేధించేవాడు. ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యుల కళ్ల ముందే.. పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే యువతి గొంతుకోసి హతమార్చాడు. ముందుగా యువతి పెదనాన్న కాపాడేందుకు వెళ్లగా ఫెనిల్ అతని కడుపులో పొడిచాడు. తర్వాత ఆమె సోదరుడిని కూడా గాయపరిచాడు. అతని రాక్షసత్వాన్ని చూసిన వారంతా ఆ యువతిని కాపాడే ప్రయత్నం చేయలేక చూస్తుండిపోయారు. యువతి గొంతు కోసి.. ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే చూసి ఆనందించాడు ఆ రాక్షసుడు.
Also Read : అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
గుట్కా తీసి తింటూ 2-3 నిమిషాల పాటు యువతివైపే చూస్తుండిపోయాడు. ఎవరైనా కాపాడటానికి వస్తే చంపేస్తానని అక్కడున్నవారిని బెదిరించాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు జరిగింది తెలుసుకుని.. ఫెనిల్ గొయాని ని అరెస్ట్ చేశారు. అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించగా.. ఈనెల 16న డిశ్చార్జ్ అయ్యాడు. విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. యువతిని చంపేందుకు ఆన్ లైన్లో ఏకే 47, ఒక చాకును కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు నిందితుడు. నిందితుడు చెప్పిన వివరాలను నమోదు చేసి, అతడిని కోర్టులో హాజరు పరిచారు.
Next Story