Mon Dec 15 2025 20:22:23 GMT+0000 (Coordinated Universal Time)
అంతా తూచ్.. సరదా కోసం మిమ్మల్ని ఫూల్స్ చేశా : రాహుల్
భారీ సినిమా ఆఫర్లు చేతిలో ఉన్న సమయంలో ఈ రిటైర్మెంట్ ఏంటని కొందరు ఏకంగా రాహుల్ కు ఫోన్ చేసి అడగడం.. ఆయన స్నేహితులు

టాలీవుడ్ లో తన నటన, కామెడీ టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ.. 2022 తర్వాత ఇక నటించను అంటూ నిన్న షాకింగ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఇది ఫేక్ అని కొట్టిపారేయగా, మరికొందరు ఏదో ప్రమోషన్ కోసం అని అనుకున్నారు. కొందరైతే నిజంగానే నమ్మేశారు. వారందరినీ ఫూల్స్ ని చేస్తూ.. ఈరోజు మరో పోస్ట్ పెట్టాడు రాహుల్.
Also Read : యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ సరయూపై కేసు నమోదు
సినిమాలు చేయనని జోక్ చేశానని.. భారీ రెమ్యునరేషన్, విలాసమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలను ఎందుకు వదులుకుంటాను?. అని మరో ట్వీట్ చేశాడు. భారీ సినిమా ఆఫర్లు చేతిలో ఉన్న సమయంలో ఈ రిటైర్మెంట్ ఏంటని కొందరు ఏకంగా రాహుల్ కు ఫోన్ చేసి అడగడం.. ఆయన స్నేహితులు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో రాహుల్ రామకృష్ణ దీనిపై మరోసారి స్పందించాడు. ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని చేశానని చెప్పడంతో.. నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. నీ సరదా కోసం మమ్మల్ని ఫూల్స్ ని చేయడం ఏంటని తిడుతున్నారు.
Next Story

