Wed Dec 17 2025 14:12:50 GMT+0000 (Coordinated Universal Time)
యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ సరయూపై కేసు నమోదు
సరయు, మరికొంతమంది హోటల్ ప్రచార పాటలో గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న బ్యాండ్ ను తలకు కట్టుకుని

యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ సరయూపై కేసు నమోదు7 ఆర్ట్స్.. ఈ యూ ట్యూబ్ ఛానల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఛానల్ లో వచ్చే కంటెంట్, భాష పై గతంలో పెద్ద రచ్చే జరిగింది. జరిగితే జరిగింది కానీ.. ఈ యూ ట్యూబ్ ఛానల్ వల్ల సరయు కి యమా క్రేజ్ వచ్చింది. అలా యూ ట్యూబర్ గా ఫేమస్ అయి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో హౌస్ లోని ఎంట్రీ ఇచ్చి, మొదటి వారమే ఎలిమినేట్ అయింది. కాగా.. ఇప్పుడు సరయు మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే ఆమె స్టార్ట్ చేసిన హోటల్ ప్రమోషన్ లో భాగంగా ఓ సాంగ్ విడుదల చేసింది. ఆ పాటలో హిందువులను కించపరిచేలా తీశారంటూ సరయుపై రాజన్న సిరిసిల్ల పీఎస్ లో కేసు నమోదైంది.
Also Read : జేఎన్టీయూలో ర్యాగింగ్.. 12 మంది సస్పెండ్
సరయు, మరికొంతమంది హోటల్ ప్రచార పాటలో గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న బ్యాండ్ ను తలకు కట్టుకుని హెటల్ లోకి వెళ్తారు. ఈ సన్నివేశంలో దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు, ఆ కేసును బంజారాహిల్స్ పీఎస్ కు బదిలీ చేశారు. పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
News Summary - police case filed against on youtuber, bigg boss 5 fame sarayu
Next Story

