జనధర్మ పత్రిక ఎమర్జన్సీలో చరిత్ర: ఓ పేజీ
సరిగ్గా 50 ఏళ్ల క్రితం. అప్పడప్పుడే వార్తలు వ్యాసాలు రాస్తున్నదశలో ఈ రచయితకు ఎమర్జన్సీ స్వేచ్ఛా వ్యతిరేకతల లక్షణాలు అర్థమవుతున్నదశ.

సరిగ్గా 50 ఏళ్ల క్రితం. అప్పడప్పుడే వార్తలు వ్యాసాలు రాస్తున్నదశలో ఈ రచయితకు ఎమర్జన్సీ స్వేచ్ఛా వ్యతిరేకతల లక్షణాలు అర్థమవుతున్నదశ. 1975 నాటి రోజులు సి కె ఎం కాలేజ్ బిఎస్సి చదువుకునేఅవకాశం కాలేజ్ మాగజైన్ ‘చైతన్య’ ప్రచురించారు. వరవరరావుగారు జైల్లోనే ఉన్నారు. ప్రముఖ రచయిత తెలుగు లెక్చరర్ శ్రీ వేంకటరత్నం సార్ మార్గదర్శనం చేసే వారు. చైతన్య మాగజైన్ సంపాదకీయం లో విప్లవ కవితలు, ఇందిరాగాంధీ పాలనలో అన్యాయాలు వివరించడం, చల్లటి కోకాకోలా ప్రియమనే వారు కాదనే వారి మధ్య పోరాటం. మనదేశానికి ఈ శీత విదేశీ పానీయాలు అవసరమా? దాని వల్ల ఏం లాభం? విదేశాల సంపన్నులకు కోట్ల రూపాయలు అప్పగించడం కాకుండా చేసేదేమిటి అనేవారం. దేశాన్ని ఆర్థిక రంగంలో అభివృద్ధి చేయకుండా ఈ కోకాకోలాలు తాగడమేమిటి అనుకునే దశ.
వరంగల్లు దేశాయపేట ప్రిన్సిపల్ అంజయ్యగారికి కూడా ‘‘ఏం నాయనా విప్లవాలు వస్తున్నాయని సంపాదకీయంలో రాస్తావా. కొంపలు మునగవా మరి. కనీసం భావవిప్లవం అన్నా బాగుండేది కదా అని అంజయ్యఆగ్రహించేవారు. ఎవరేమన్నా సరే, అప్పడికి చైతన్య మాగజైన్ ప్రింట్ అయిపోయింది. మాగజైన్ కాపీలు పంచడం అయిపోయింది. అప్పుడే 25 జూన్ 1975 ఎమర్జన్సీ సమస్య. భయం భయం అంతటా?.
పోలీసులు దిగారు. ఆఫీసర్లు, అంజయ్యసార్, కలెక్టర్ తరఫున అధికారులు వచ్చి మాగజైన్ రక్షించడానికి విప్లవ వ్యాసాలున్న పేపర్లన్నా తీసేద్దామా అని సాధ్యం కాలేదని బాధపడేవారు. ఆలోచించేవారు. సాధ్యం కాదని తెలిసి మాగజైన్లు మొత్తం కట్టగట్టితీసి పారేయాలని ఎవరనుకుంటారు? నానాతంటాలు పడి, పోటీలోనిలబడి గెలిచి, ఆహా ఓహో అనుకుని సంపాదకీయం రాసుకుంటూ ఉండకుండా, ఈ ఎమర్జన్సీ ఎందుకు రావడం. విద్యార్థులందరి నుంచి మాగజైన్ తిరిగి వాపస్ చేయాలని గట్టిగా చెప్పారు. వరసగా మా సంచిక ఇవ్వాలని అందరినుంచి తీసుకుంటున్నారు. మొత్తం లెక్క రాసుకుని, ప్రతి క్లాస్ లో ఒక్కొక్కడినుంచి పేరు రోల్ నెంబర్ ప్రకారం చైతన్య మాగజైన్ సంచికలు వసూలు చేసుకున్నారు. ఇప్పడికీ ఒక్క కాపీ అయినా దొరకలేదు, అడిగితే దిక్కులేదు. ప్రిన్సిపల్ గా తెలంగాణ జాతి పిత కె జయశంకర్, ఆ కమిటీకి జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్ గారు. అప్పుడు కలెక్టర్ స్మర జిత్ రాయ్ పనిచేసేవారు. ఉండేవారు. మరేదీ చేయలేని స్థితి. ఎమర్జన్సీ. అప్పడికే, జనధర్మ పత్రికలలో, వార్తా రచనలు, (ఇతర ఈ రచయిత రాసేవాడిని). రచనలు చేస్తూ ఉండేవాణ్ని. ఎమర్జన్సీ కాలంలో సమాచార భారతిని మాత్రం న్యూస్ పేపర్లకు న్యూస్ ఏజన్సీలను విడి విడిగా ఉండిన వారిని ఇందిరమ్మ గారు రద్దు చేసారు. వారితో పిటిఐ, యూఎన్ ఏ, హిందూస్తాన్ సమాచార్, సమాచార భారతి ఏజెన్సీ కలిపి ‘సమాచార్’ ఏజెన్సీ అని మాత్రమే ఉండేది. ప్రభువులు గారి ఆజ్ఞల ప్రకారమే వార్తలు ఇచ్చేవారు. అందుకు ఎమర్జెన్సీ కాలంలో పత్రికలన్నీ సైలెంట్ గా అంటే మౌనంగా అంటూ సంపాదకీయాల స్తలాలలో ఖాళీగా తెల్లబోసి వదిలిపోయే స్థితి. ఇందిరాగాంధీని విమర్శిస్తే జైలుకుపోవలసిందే.
కాలానికి కాదు కాల్ కి కాదు, చైతన్య మాగజైన్ కాల్చిపారేవారు. ప్రిన్సిపాల్ జయశంకర్ ‘‘ఇంకెక్కడిదీ ‘చైతన్య’, శ్రీధర్, నీకు ఏమైందో తెలుసా. మొత్తం నీవు ఎడిటర్ గా ఉన్ చైతన్య సంచికలన్నీ ఒక్కొక్కటి వెతికి పట్టి కట్టగట్టి, అంత్యక్రియలు చేసినట్టు, పెట్రోల్ చల్లి, మరీ కాల్చిపడేసారు. అందుకు నేను సాక్షిని. ఆ అన్యాయానికి అధికారులు పోలీసులు కలిసి నిలబడి అన్ని సంచికలు బూడిదయ్యే దాకా చూసారు, ఏం చెప్పను’’ అని బాధగా చెప్పారు జయశంకర్ సార్.
వరంగల్లు పత్రిక జనధర్మ ప్రీ సెన్సార్
జనధర్మ పత్రిక ప్రెస్ నుంచి ఎడిటర్ నాయకత్వంలో కార్మికులు కంపోజ్ చేసి ప్రింట్ చేయడానికి ముందు తడిసిన ప్రూఫ్ కాగితాలను ఎండబెట్టి తరువాత ప్రీసెన్సార్ కోసం కలెక్టర్ కార్యాలయానికి ఒక ఆఫీసర్ గారికి ఇవ్వాలి. ప్రతివారం కట్టల కట్టలుగా పత్రిక ప్రూఫ్ లు చదివి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారో లేదా తెలుసుకోవడానికి ఆ ఆఫీసర్ చదవక తప్పదు. చదివితే అర్థమవుతుందో లేదో మనం చెప్పలేం కదా. దాదాపు చదివినా చదవక పోయినా చదవలేకపోయినా సంతకాలు చేసి దానికి కింద కలెక్టర్ కార్యాలయం ముద్ర స్టాంప్ చేయాల్సిందే. అప్పుడు యం యస్ ఆచార్య గారు పంపడం, కార్మికులు మేకప్ చేసేవాడిని. అంతకు ముందు ఒక సెటైర్ రాసిన విమర్శతో నేనే కంపోజ్ చేసి మేకప్ చేసి ప్రింటింగ్ కు ఎడిటర్ పరిశీలించిన తరువాత ఓకే అన్నతరువాత మెషిన్ కు ప్రింట్ చేయించాలి. సాయంత్రానికి ఆ పేజీ రెడీ చేయడం నేను మూడుగంటల దాకా ప్రింట్ చేసేది. మరికొన్ని పేజీల తరువాత గురువారానికి ముందు రాత్రి ప్రింట్ ముగించి పోస్ట్ ఆఫీస్ కు పంపడం ఉదయం ఎనిమిది గంటలకే ఇవ్వాలి.
ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం కోసం ప్రత్యేక సంచిక తయారు చేసింది. అందులో ‘‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’’ పేరుతో సెటైర్ అని ఒక వ్యంగ్య తయారైంది. ఎడిటర్ పంపిన తరువాత జిల్లా ఆఫీసర్ల ప్రీ సెన్సారింగ్ పూర్తయింది. ప్రింటింగ్ కూడా జరిగింది. అందువల్ల అనేకానే సమస్యలు మొదలైనాయి. కలెక్టర్లకు ఎవరో పోలీసులకు కంప్లయింట్ చేసారు. దానికి జనధర్మ ఎడిటర్ కు ఫిర్యాదు వచ్చింది.
‘‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది!’’
అక్కడనుంచి స్వయంగా స్మరజిత్ రాయ్ కలెక్టర్ గారే మాట్లాడుతున్నారు. ఆచార్యాసాబ్ అని ‘‘ఇది ఎమర్జన్సీ కదా, ప్రభుత్వానికి విమర్శించే పత్రికలో రాయడం మాకు కష్టం కదా. మీపైన చర్య తీసుకోవలసి వస్తుంది కదా.. ఈ వ్యాసం మీరు రాసారే ఇంకెవరైనా రాసారా. ఇక్కడ శ్రీధర్ అనే పేరు ఉంది, ఈయన ఎవరు అని అడిగారు. ఎడిటర్ యం యస్ ఆచార్యగారికి అర్థమైంది నా రచన సమస్యగా తయారైంది. ‘‘మీకు నేను ప్రీ సెన్సార్ సంతకాలు తీసుకున్నారు కదా. మీ ఆఫీసర్ ఒప్పుకున్నారు కదా. మళ్లీ నన్ను ఎందుకు అడుగుతున్నారు’’ అని కలెక్టర్ ను నిలదీసినట్టు అడుగుతూ మిత్రులు భయపడిపోతున్నారు, ఇప్పడేమైనా అరెస్టు చేసారా ఏమిటి?
‘‘నాకు తెలుగు రాదు. ఇంగ్లీషులోనూ అప్పుడప్పుడు హిందీలో మాట్లాడుతూ ఉంటాం. ఇక మా ఆఫీసర్ గారికి అర్థం అయిందో లేదో నాకు భాష రాదు. ఇప్పుడు ఆ తెలుగు తెలిసిన ఆఫీసర్ ను అరెస్టు చేయాలి కదా. ఎందుకండీ ఎంత బాధ పెట్టడం. కనుక దయచేసి మీరు ఇటువంటి ప్రచురించకుంటే బాగుంటుంది’’ అని కలెక్టర్ గారు మర్యాదగానే మందలింపుగానే అన్నట్టు అంటున్నారు. ‘‘మీరు ప్రీ సెన్సార్ తరువాత మా పైన ఏం చర్య తీసుకుంటారు మీ ఆఫీసర్లమీదే చర్య తీసుకోవాలి కదా’’ అని వాదన సాగింది.
ఎమర్జెన్సీ సమయంలో ‘మనకు స్వరాజ్యం వచ్చింది. కానీ, స్వాతంత్య్రం రాలేదు’- అనే ఇతివృత్తంతో ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ అనే ఈ రచన వ్యంగ్యరచన చేశాను. ‘‘వీడు ఇంకా డిగ్రీ పూర్తిగాలేదు. వీడెవడు ఇందిరాగాంధీకి సెటైర్ రాసేంత స్థాయికి వస్తాడా? వాడిని అరెస్టు చేస్తే ఇప్పుడేం చేయాలె‘’’ అని ఎడిటర్ విమర్శించారు. వారి శ్రీమతికి బొలెడంత కామన్ సెన్స్ ఉంది. తన ఇంగితం తో అడుగున్నదేమంటే ‘‘వాడు ఇందిరాగాంధీని తిట్టడం, మీరు జనధర్మ పత్రికలో ప్రింట్ చేయడం ఏమిటి?’’ అంటే అమ్మకు ప్రశ్నలన్నీ వివరించారు నాన్న. ఇప్పుడు అమ్మ ‘‘ఓహో ఇందన్నమాట. వాడేదో రాసిండనుకో, మీరు ఎందుకు పేపర్ లో ఎందుకు వేసినారండి’’ అని ఎదురు ప్రశ్నలు వేసాడు.
అసలు రాసిన కథ ఏమిటి?
‘‘వాణ్ని రానీ, నేను కూడా అడుగుతాను మీకు ఇబ్బందులు తేవడం ఎందుకు?’’ అని అమ్మ ‘‘సర్దిచెప్తాను తప్పకుండా, అయినా రాసిందేమిటసలు?’’ అమ్మ అన్నది. ‘‘నాకూ స్వతంత్రం వచ్చింది!’’ అని ఒక వ్యంగ్యం ఉద్ధరించాడు ఈ మహానుభావుడు’’ అన్నాడు
‘‘అవును...అయినా వాడు చాలా బాగా రాసిండు’’ అని ఎడిటర్ అని (ఈ రచయితను) మెచ్చుకున్నాడు. ‘‘ఎందుకీ పిచ్చిరాతలు. నాన్నకు ఎందుకు సమస్యలు తీసుకొస్తావ్? ఇందాకా నీ గురించే నీ గొప్పతనం’’ అమ్మ అన్నది. ‘‘అది సరే నీకు తెలుసా, చివరకు నువ్వు రాసిందేదో బాగుందని మెచ్చుకున్నాడ్రా’’. అవును అని దంపతులు అన్నారు. మరిచిపోలేని జ్ఞాపకం ఈ ఎమర్జన్సీ కథ.

