Sun Oct 06 2024 01:38:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్య..
రెండ్రోజులుగా తల్లిదండ్రులు భూలక్ష్మి, కొండయ్యలు కనిపించకపోవడంతో.. కూతురు ఆశాజ్యోతి కుషాయిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక భార్య, భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలంగాణలోని బొల్లారం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. రెండ్రోజులుగా తల్లిదండ్రులు భూలక్ష్మి, కొండయ్యలు కనిపించకపోవడంతో.. కూతురు ఆశాజ్యోతి కుషాయిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఆశాజ్యోతి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దంపతుల కోసం గాలించగా.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో బొల్లారంలోని క్యావెలరి బ్యారక్స్ వద్ద ఉన్న రైలు పట్టాలపై విగతజీవులుగా కనిపించారు.
కొండయ్య తిరుమలగిరి ఆర్మీ రీజియన్ లో సుబేదారిగా విధులు నిర్వహిస్తుండగా.. వారి కుమార్తె ఆశాజ్యోతి కుషాయిగూడ పీఎస్ లోనే కాని స్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా వారి కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు ఆశాజ్యోతి వెల్లడించింది. దాంతో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే భూ లక్ష్మి, కొండయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
News Summary - Wife and husband Commits Suicide at Bollaram Railway Track due to Financial Troubles
Next Story