Mon Dec 09 2024 04:17:31 GMT+0000 (Coordinated Universal Time)
వేధించడం వాస్తవమే.. కానీ ఇంత దారుణం జరుగుతుందనుకోలేదు : వినోద్ జైన్
బాలిక ఆత్మహత్యకు పాల్పడిన అపార్ట్ మెంట్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజీలో నిందితుడి వికృతచేష్టలు, బాలిక ఆత్మహత్య
లైంగిక వేధింపులు భరించలేక.. విజయవాడలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక ఆత్మహత్య కేసులో.. భవానీపురం పోలీసులు.. టీడీపీ నేత వినోద్ జైన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. పోలీసుల విచారణలో వినోద్ జైన్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
బాలిక ఆత్మహత్యకు పాల్పడిన అపార్ట్ మెంట్ వద్ద లభించిన సీసీ టీవీ ఫుటేజీలో నిందితుడి వికృతచేష్టలు, బాలిక ఆత్మహత్య దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ ఫుటేజీలను చూపించి.. వినోద్ జైన్ ను ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో ఉండే వినోద్ జైన్.. అదే అపార్ట్ మెంట్ కు చెందిన బాలిక మెట్లు ఎక్కేటపుడు, దిగేటపుడు, లిఫ్ట్ వద్ద వేధించినట్లు అంగీకరించినట్లుగా సమాచారం. స్కూల్ కు వెళ్లేటపుడు, వచ్చేటపుడు ఆ బాలిక కోసం ఎదురుచూసి మరీ.. ఆమెను ఇబ్బందులకు గురిచేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ పాపను తాకుతూ.. ఆనందం పొందేవాడినని వినోద్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ బాలికతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు.
Also Read : నిర్మలమ్మ బడ్జెట్ నిండా ముంచిందే?
తాను చేసింది తప్పేనని అంగీకరించిన వినోద్ జైన్.. తాను చేసిన తప్పుకు బాలిక ఆత్మహత్య చేసుకునేంత వరకూ వస్తుందని ఊహించలేదన్నాడు. బాలిక ఆత్మహత్య చేసుకునే ముందర డాబాపైన పిట్టగోడ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కిందపడతావు.. జాగ్రత్త అని హెచ్చరించినట్లు సమాచారం. అయినా బాలిక వినకుండా ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు.
Next Story