Fri Dec 05 2025 15:12:13 GMT+0000 (Coordinated Universal Time)
తీవ్ర విషాదం.. సాంబార్ లో పడి చిన్నారి మృతి
విస్సన్నపేట దళితవాడలో బంధువుల ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్ కు తల్లిదండ్రులతో పాటు ఆ పాప కూడా వెళ్లింది. ఫంక్షన్ జరుగుతుండగానే..

మాటలకు, ఊహకు కూడా అందని విషాదమిది. ప్రమాదవశాత్తు సాంబార్ లో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లా విస్సన్నపేటలో చోటుచేసుకుంది. ఎంతో హ్యాపీగా సాగాల్సిన బర్త్ డే ఫంక్షన్ విషాదాంతమయింది. విస్సన్నపేట దళితవాడలో బంధువుల ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్ కు తల్లిదండ్రులతో పాటు ఆ పాప కూడా వెళ్లింది.
Also Read : ఏపీలో 500 దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసులు
ఫంక్షన్ జరుగుతుండగానే.. అప్పటివరకూ కుర్చీలో కూర్చున్న చిన్నారి.. ఉన్నట్లుండి పక్కనే ఉన్న వేడి వేడి సాంబార్ గిన్నెలో పడిపోయింది. చిన్నారికి తీవ్రగాయాలవ్వగా.. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది. సాంబార్ రూపంలో ఆ చిన్నారిని మృత్యువు కబళించింది. పాప మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News Summary - two years old child dies after falling in hot sambar pot at vissannapet
Next Story

