Mon Sep 09 2024 11:44:18 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిలో విషాదం.. భోజనం చేసిన 1200 మంది ఆస్పత్రి పాలు
స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో 1200 మందికి పైగా అతిథులు విందుభోజనం చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికి..
గుజరాత్ : వైభవంగా పెళ్లి జరిగింది. వధూవరులను ఆశీర్వదించిన అతిథులు.. పెళ్లి విందు భోజనం చేశారు. కొద్దిసేపటికే వారంతా అనారోగ్యానికి గురికావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గుజరాత్ రాష్ట్రం మెహసనా జిల్లా విస్ నగర్ తాలూకా సావల గ్రామంలో జరిగిందీ ఘటన. శుక్రవారం పొద్దుపోయాక జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్థానిక కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో 1200 మందికి పైగా అతిథులు విందుభోజనం చేశారు.
భోజనం చేసిన కొద్దిసేపటికి చాలా మంది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లి విందులో చేసిన ఆహార నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్ మెంట్ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పెళ్లి విందులో శాకాహారంతో పాటు మాంసాహారం కూడా వడ్డించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story