Fri Sep 13 2024 15:28:11 GMT+0000 (Coordinated Universal Time)
బర్త్ డే రోజు యువకుడి దారుణ హత్య.. స్నేహితులే హంతకులు !
గత రాత్రి తిరుపతిలోని ఓ హోటల్ వద్ద ప్రసన్న కుమార్ అనే యువకుడిని అతని స్నేహితులు బీరుబాటిళ్లతో పొడిచి చంపేశారు. మృతుడు
ఓ యువకుడి దారుణ హత్య తిరుపతిలో తీవ్ర కలకలం రేపుతోంది. స్నేహితులే పుట్టినరోజు నాడు అతడిని హతమార్చడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. గత రాత్రి తిరుపతిలోని ఓ హోటల్ వద్ద ప్రసన్న కుమార్ అనే యువకుడిని అతని స్నేహితులు బీరుబాటిళ్లతో పొడిచి చంపేశారు. మృతుడు ప్రసన్న కుమార్ అధికార పార్టీలో ఉన్న కొందరు కార్పొరేటర్లకు సన్నిహితుడు. దీంతో అతని బర్త్ డే వేడుకలను నిన్న తిరుపతిలోని పలు ప్రాంతాల్లో సెలబ్రేట్ చేశారు.
Also Read : బ్లూ ప్రింట్ రెడీ చేయండి....వారికి ముద్రగడ లేఖ
పుట్టినరోజు వేడుకల్లో భాగంగా.. ప్రసన్నకుమార్ సోమవారం రాత్రి ఓ హోటల్ లో రూమ్ తీసుకుని, అందులో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో 8 మంది స్నేహితులు పాల్గొనగా.. మద్యం మత్తులో స్నేహితులకు - ప్రసన్నకుమార్ కు మధ్య గొడవ జరిగింది. దాంతో హోటల్ ముందే ప్రసన్న కుమార్(29) అనే యువకుణ్ణి మద్యం సీసాలతో సహచర యువకులు పొడిచి చంపారు. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రసన్న స్నేహితులైన ఎల్లంరెడ్డి, పవన్ కుమార్, బాలాజీలు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story