Sat Oct 12 2024 15:54:32 GMT+0000 (Coordinated Universal Time)
థర్డ్ వేవ్ మొదలైంది : కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా
తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా సంచలన ప్రకటన చేశారు. భారత్ లో థర్డ్ వేవ్ మొదలైందని ఆయన స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ తో పాటు కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే కోవిడ్ ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలను మూసివేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు 50 శాతం ఉద్యోగులతో నడుస్తున్నాయి. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ అధిపతి డాక్టర్ ఎన్కే అరోరా సంచలన ప్రకటన చేశారు. భారత్ లో థర్డ్ వేవ్ మొదలైందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, కోల్ కతా వంటి మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, ఆ అవన్నీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులేనని తెలిపారు.
Also Read : భారత్ ను వణికిస్తున్న కరోనా.. ఒమిక్రాన్
గతేడాది డిసెంబర్ తొలి వారంలో దేశంలో తొలి ఒమిక్రాన్ కేసును గుర్తించగా.. డిసెంబర్ చివరి వారానికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం కొత్తవేరియంట్ కేసులేనని అరోరా వివరించారు. గడిచిన నాలుగైదు రోజులుగా దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య.. థర్డ్ వేవ్ మొదలైందని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఇదిలా ఉండగా.. టీనేజర్లకు కోవిడ్ టీకాలు ఇవ్వడంపై వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. ఈ సమయంలో టీనేజర్లకు టీకాలు వేయడం ఎంతో సురక్షితమని అరోరా పేర్కొన్నారు.
Also Read : వంద మంది విద్యార్థులకు కరోనా
Next Story