Fri Dec 05 2025 16:38:23 GMT+0000 (Coordinated Universal Time)
రూ.200 కోసం తల్లిని నరికి చంపిన కొడుకు
మంచిర్యాలలోని రాజీవ్ నగర్ లో ఓ వ్యక్తి తన తల్లిని దారుణంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినసరి కూలీ..

రూ.200 కోసం కన్న కొడుకు తల్లిని నరికి చంపిన దారుణ ఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. మంచిర్యాలలోని రాజీవ్ నగర్ లో ఓ వ్యక్తి తన తల్లిని దారుణంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినసరి కూలీ అయిన సత్తెమ్మ (65) కొన్నేళ్ల క్రితమే భర్తను పోగొట్టుకుంది. తన కష్టంతోనే కొడుకు, కూతురిని పోషిస్తోంది. కొడుకు మాత్రం ఇంటి బాధ్యతలు పట్టనట్టుగా తిరిగేవాడు. తన జల్సాల కోసం అప్పుడప్పుడు తల్లితో గొడవపడి డబ్బులు తీసుకునేవాడు.
Also Read : బైక్ ను ఢీ కొట్టిన వ్యాన్.. ముగ్గురు మృతి
మద్యానికి బానిసైన కొడుకు చంద్రశేఖర్.. ఎప్పటిలాగే తల్లి సత్తెమ్మను మద్యం కోసం రూ.200 అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో.. ఆగ్రహానికి గురైన చంద్రశేఖర్.. తల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Next Story

