Sat Sep 07 2024 10:21:06 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ ను ఢీ కొట్టిన వ్యాన్.. ముగ్గురు మృతి
ఎదురులంక - యానాం సమీపంలోకి రాగానే.. వెనుక నుంచి వచ్చిన వ్యాన్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు సహా కుమారుడు..
తూర్పు గోదావరి జిల్లా ఎదురులంక - యానాం బాలయోగి వంతెనపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కొడుకు, కూతురితో కలిసి ద్విచక్రవాహనంపై దంపతులు కాకినాడ వెళ్తున్నారు. ఎదురులంక - యానాం సమీపంలోకి రాగానే.. వెనుక నుంచి వచ్చిన వ్యాన్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు సహా కుమారుడు మృతి చెందగా.. కూతురు తీవ్రగాయాలపాలైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుమార్తెకు చికిత్స చేయిస్తున్నారు. మృతులంతా ఐ. పోలవరం మండలానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story