Fri Oct 04 2024 06:31:29 GMT+0000 (Coordinated Universal Time)
16 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. స్కూల్లో విద్యార్థినితో మళ్లీ ప్రేమ.. మొదటి భార్యను మోసం చేసి..
పెళ్లై ఏడేళ్లయినా పిల్లలు లేరన్న బాధ మహేశ్వరిని కలచివేసింది. 12 ఏళ్లకు.. 2018లో ఓ పాప పుట్టింది. ఇక పిల్లలు లేరన్న బెంగ కూడా
అతని పేరు సెంథిల్ కుమార్. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. పుదుచ్చేరిలోని కలితీర్థల్ కుప్పం ప్రాంతానికి చెందిన మహేశ్వరి అనే మహిళతో 16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం అయింది. 2006లో ప్రేమ పెళ్లి అవ్వగా.. అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో.. మహేశ్వరి తల్లిదండ్రులు కట్నకానుకలతో పాటు బైక్ కూడా కొనిచ్చారు. కొన్నాళ్లు భార్యా భర్తలు అన్యోన్యంగానే ఉన్నారు.
పెళ్లై ఏడేళ్లయినా పిల్లలు లేరన్న బాధ మహేశ్వరిని కలచివేసింది. 12 ఏళ్లకు.. 2018లో ఓ పాప పుట్టింది. ఇక పిల్లలు లేరన్న బెంగ కూడా లేదు. అంతా బావుంది. కాపురం సజావుగా సాగింది. పాప పుట్టిన నాలుగేళ్ల వరకూ ఎలాంటి లోటు లేకుండా ఉన్నారు. ఆ తర్వాతే సెంథిల్ కుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యాభర్తలిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఇద్దరూ చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలోనే.. తను చదువు చెప్పే స్కూల్లో రేఖ అనే యువతితో సెంథిల్ కుమార్కు పరిచయం ఏర్పడింది. ఈ గురుశిష్యురాలు ఇద్దరూ బాగా దగ్గరయ్యారు.
రేఖ 10వ తరగతి పూర్తయ్యాక.. ఆ తర్వాత చదువు సెంథిల్ కుమారే తన సొంత డబ్బులతో ఫీజు కట్టి మరీ చెప్పించాడు. గురువు అన్నాక.. శిష్యురాలికి ఆ మాత్రం సహాయం చేయరా అని అనుకోవచ్చు. కానీ.. వారి మధ్య ఉన్నది కేవలం గురు శిష్యుల బంధం మాత్రమే కాదు. ప్రేమ కూడా. ప్రస్తుతం ఆమె డిగ్రీ కూడా పూర్తి చేసింది. రేఖ వయసు ఇప్పుడు 21 సంవత్సరాలు. ఇన్నాళ్లు ఆమెను పెళ్లి చేసుకునేందుకు సెంథిల్ కు అడ్డుగా ఉన్నది ఆమె వయసు ఒక్కటే. ఇప్పుడది కూడా లేకపోవడంతో.. భార్యకు విడాకుల నోటీసు పంపి, రేఖతో వెళ్లిపోయాడు. షాకైన మొదటిభార్య మహేశ్వరి.. సెంథిల్ వ్యవహారంపై ఆరా తీసింది. మొత్తం తెలియడంతో.. తన పాపను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త బాగోతంపై ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులూ స్పందించలేదని తెలుస్తోంది. ఇది తెలిసిన వారంతా.. ఆ ప్రబుద్ధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story