Thu Dec 18 2025 10:12:56 GMT+0000 (Coordinated Universal Time)
సోనూసూద్ పై కేసు నమోదు
ఫిబ్రవరి 20, ఆదివారం పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా సోనూసూద్ ఎన్నికల..

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ పై పంజాబ్ లో కేసు నమోదైంది. ఫిబ్రవరి 20, ఆదివారం పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా సోనూసూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై మోగాలో కేసు నమోదైంది. సోనూసూద్ సోదరి మాళవిక కాంగ్రెస్ లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read : విదేశీ హై గ్రేడ్ గంజాయి..సీజ్ చేసిన అధికారులు
పోలింగ్ రోజున ఎవరూ ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించకూడదన్న నియమం ఉంది. కానీ.. సోనూసూద్ మాత్రం పోలింగ్ రోజున తన సోదరి కోసం ప్రచారం చేస్తూ.. నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళికి సంబంధించి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో కేసు నమోదు చేసినట్టు మోగా పోలీసులు తెలిపారు.
Next Story

