Mon Sep 09 2024 12:30:53 GMT+0000 (Coordinated Universal Time)
విదేశీ హై గ్రేడ్ గంజాయి..సీజ్ చేసిన అధికారులు
అమెరికా నుంచి వచ్చిన ఓ కొరియర్ చూడ్డానికి అనుమానాస్పదంగా ఉండటంతో.. ఎన్సీబీ అధికారులకు ఆ కొరియర్ సంస్థ ప్రతినిధులు..
గంజాయి దందా.. అనగానే వెంటనే గుర్తొచ్చేది విశాఖ. అక్కడే గంజాయి సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. విశాఖ నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు.. పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుంటుంది. పోలీసులకు చిక్కితే ఓకే.. చిక్కకపోతే మాత్రం అక్రమార్కుల ఆగడాలకు అంతుండదు. పోలీసుల కళ్లుగప్పి.. వారు చేసేది చేస్తుంటారు. కానీ ఇప్పుడు మత్తు మాఫియా కేటుగాళ్లు అధికారులకు ఊహించని ఝలక్ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు హైగ్రేడ్ గంజాయిని పంపించారు.
Also Read : ఏపీ ఆర్టీసీకి షాక్ ఇచ్చిన చమురు కంపెనీలు
అమెరికా నుంచి వచ్చిన ఓ కొరియర్ చూడ్డానికి అనుమానాస్పదంగా ఉండటంతో.. ఎన్సీబీ అధికారులకు ఆ కొరియర్ సంస్థ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ పార్శిల్ ను ఓపెన్ చేసి చూస్తే.. 1420 గ్రాముల గంజాయి బయటపడింది. అది కూడా అమెరికాలో పండించిన హైగ్రేడ్ గంజాయి. దాని విలువ మార్కెట్ లో సుమారు రూ.15 లక్షల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
అధికారుల తనిఖీల్లో పట్టుబడిన ఆ గంజాయిని హైదరాబాద్ లోని కాలేజీ విద్యార్థులు, వివిధ సంస్థల్లో పనిచేసే అధికారులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఆ పార్శిల్ పై ఉన్న అడ్రస్ ఆధారంగా ఎన్సీబీ అధికారులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారు గతంలో చాలాసార్లు అమెరికా నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని అమ్మినట్లు విచారణలో తేలింది. డార్క్ నెట్ ద్వారా గంజాయి ఆర్డర్ చేసి, కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా ఈ దందా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.
Next Story