Fri Sep 13 2024 15:49:56 GMT+0000 (Coordinated Universal Time)
సింగరేణి బొగ్గుగనుల్లో ప్రమాదం.. నలుగురు మృతి
ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం బొగ్గు గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ నరేష్ తో పాటు..
రామగుండం : పెద్దపల్లి జిల్లా రామగుండం -3 పరిధిలోని ALP బొగ్గు గనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం బొగ్గు గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ నరేష్ తో పాటు.. మరో ముగ్గురు కార్మికులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : మళ్లీ పెరగనున్న పెట్రోల్ ధరలు.. భారీ వడ్డన తప్పదా ?
సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా.. బొగ్గు గనిలో ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story