Sat Oct 12 2024 16:22:32 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ పెరగనున్న పెట్రోల్ ధరలు.. భారీ వడ్డన తప్పదా ?
గడిచిన 14 ఏళ్లలో తొలిసారి బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరింది. 2008 నుంచి ఇప్పటి వరకూ ఇదే అత్యధిక రేటు. క్రూడాయిల్..
న్యూ ఢిల్లీ : నేటితో దేశంలోని పలు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తవుతోంది. దాంతో మళ్లీ పెట్రోల్, డీజిల్ రేట్లు గణనీయంగా పెరగనున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సామాన్యుడిపై భారం తప్పేలా లేదని నిపుణులు చెప్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో దేశంలో మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ రేట్లపై రోజువారీ ధరల పెంపు ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేశారు. నేటితో ఆ ఎన్నికలు పూర్తికానుండటంతో.. రేపట్నుంచే పెట్రోల్ బాంబు పేలుతుందని వార్తలొస్తున్నాయి. రాబోయే నెలరోజుల్లో లీటర్ పెట్రోల్ ధర ఏపీలో రూ.158కి, తెలంగాణలో లీటర్ రూ.155కి చేరనుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పుతిన్ సేన ఉక్రెయిన్ లో మోగిస్తోన్న బాంబుల మోత ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతోన్న యుద్ధం.. భారత్ సహా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం కారణంగా.. గడిచిన 14 ఏళ్లలో తొలిసారి బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరింది. 2008 నుంచి ఇప్పటి వరకూ ఇదే అత్యధిక రేటు. క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగిపోవడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు రానున్నాయి. చమురు కంపెనీలు పెట్రోల్ లీటరుకు దాదాపు 12 నుంచి 25 రూపాయల వరకు పెంచే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే సామాన్యుని జేబుకు చిల్లుపడటం ఖాయం. ఇక బంగారం ధర 60వేల రూపాయలను టచ్ చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,800గా ఉంది.
Next Story