Sat Sep 07 2024 10:38:55 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై అత్యాచారం, హత్య !
మృతురాలికి పెళ్లి నిశ్చయం అయింది. నిశ్చితార్థం కూడా పూర్తైంది. రోజూ తనకు కాబోయే భర్తతో మాట్లాడేది. అది చూసి
రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లాలోని సంగ్వారా ప్రాంతంలో.. సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. యువతిపై అత్యాచారం, ఆపై హత్య జరిగినట్లు పోస్టుమార్టం నివేదిక చెప్తోంది. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేయగా.. యువతిని ఏకపక్షంగా ప్రేమించిన యువకుడే ఆమెను హతమార్చినట్లు తేలింది. దాంతో ముఖేష్ నానోమా అనే యువకుడిని అరెస్ట్ చేసి విచారణ చేయగా.. అతను షాకింగ్ విషయాలను బయటపెట్టాడు.
మృతురాలికి పెళ్లి నిశ్చయం అయింది. నిశ్చితార్థం కూడా పూర్తైంది. రోజూ తనకు కాబోయే భర్తతో మాట్లాడేది. అది చూసి తాను తట్టుకోలేకపోయేవాడినని, అందుకే ఆమెను బావిలోకి తోసి హతమార్చేందుకు ఓ పథకం వేసినట్లు ముఖేష్ చెప్పుకొచ్చాడు. ప్లాన్ ప్రకారం యువతిని తన ఇంటికి పిలిచిన ముఖేష్.. క్రమంగా తన ఇంటికి కొంతదూరంలో ఉన్న పొలం బావివద్దకు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ అది కాస్తా విఫలమైంది. దాంతో ఆమెపై అత్యాచారం చేసి, ఆపై యువతి మఫ్లర్ తోనే చెట్టుకు ఉరివేశాడు. తర్వాత యువతి చనిపోయిందో లేదో.. తెలుసుకునేందుకు రాయితో పొడిచాడు. ఏ కదలికా లేకపోవడంతో ఆమె మరణించిందని గ్రహించి.. సైలెంట్ గా ఇంటికి చేరుకున్నాడు. ఇది జరిగిన 20 గంటల్లోనే పోలీసులు నేరస్తుడిని అరెస్ట్ చేశారు.
Also Read : మోదీ భద్రతపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు
Next Story