Tue Jan 20 2026 18:16:08 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ భద్రతపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనపై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల కడుపు మండి ప్రధానికి చుక్కలు చూపించారన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరించిన వారికి ఎవరైనా ఇలాంటి ఘటనలే స్వాగతం చెబుతాయని షర్మిల అన్నారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా రైతులు అదే తరహాలో బుద్ధి చెబుతారని షర్మిల అన్నారు. ఆరోజు ఎంతో దూరం లేదన్నారు.
కేసీఆర్ కు కూడా....
రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని వైఎస్ షర్మిల తెలిపారు. పంటలకు సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం, ప్రత్యేక చట్టాలు తేవడం వంటివి రైతుల కడుపు మండేలా చేశాయని చెప్పారు. అందుకే ప్రధాని వెనుదిరిగి వచ్చారని షర్మిల అన్నారు. కేసీఆర్ కు కూడా త్వరలోనే అదే గతి పడుతుందని షర్మిల అన్నారు.
- Tags
- ys sharmila
- modi
Next Story

