Thu Dec 18 2025 07:29:21 GMT+0000 (Coordinated Universal Time)
ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపిన జవాన్
శిబిరంలో ఉన్న ఓ బీఎస్ఎఫ్ జవాను.. కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్ల ప్రాణాలు తీశాడు. తోటి జవాన్లు తనను పదే పదే..

అమృత్ సర్ : ఐదుగురు భారత జవాన్లను తోటి జవాను కాల్చి చంపడం కలకలం రేపింది. పంజాబ్ లోని అమృత్ సర్ బీఎస్ఎఫ్ సిబ్బంది శిబిరంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా అలజడి రేగింది. శిబిరంలో ఉన్న ఓ బీఎస్ఎఫ్ జవాను.. కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్ల ప్రాణాలు తీశాడు. తోటి జవాన్లు తనను పదే పదే అవహేళన చేయడం వల్లే ఆ జవాన్ ఇలా చేసినట్లు తెలుస్తోంది.
Also Read : భక్తుడిపై పూజారి దాడి.. వైరల్ అవుతోన్న వీడియో
కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాల్పుల కారణంగా ఐదుగురు మృతి చెందగా.. మరో జవానుకు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ.. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

