Tue Sep 10 2024 12:09:58 GMT+0000 (Coordinated Universal Time)
పోలీస్ సిబ్బందితో వెళ్తున్న బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఒడిశాలోని నబరంగ్ పూర్ లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు 40-45 మంది భద్రతా సిబ్బంది బస్సులో బయల్దేరారు. ఆ బస్సు పాపడ హండి
ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాలోని పాపడహండి పీఎస్ పరిధిలోని సోరిస్ పదర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడటంతో ముగ్గురు పోలీసులు స్పాట్ లోనే మరణించారు. మరో 14 మంది గాయపడగా.. వారందరినీ చికిత్స నిమిత్తం పాపడహండి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అందిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని నబరంగ్ పూర్ లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు 40-45 మంది భద్రతా సిబ్బంది బస్సులో బయల్దేరారు.
ఆ బస్సు పాపడ హండి నుంచి కొసగుముడకు వెళ్తుండగా.. బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించినా.. బ్రేకులు పనిచేయకపోవడంతో ఓ మలుపు వద్ద బస్సు బోల్తా పడి 15 అడుగుల వరకూ దూసుకెళ్లింది. స్థానికులు ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బంది రవి బిసోయ్, సిహెచ్ శేషారావు, జగబంధు గౌడగా గుర్తించారు. భద్రతా సిబ్బంది మృతి పట్ల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతాపం ప్రకటించారు.
News Summary - 3 cops killed, 14 injured in road mishap during poll duty in Odisha’s Nabrangpur
Next Story