Sat Sep 14 2024 10:52:03 GMT+0000 (Coordinated Universal Time)
మచిలీపట్నంలో గంజాయి దందా.. పోలీసుల అదుపులో విద్యార్థి
మచిలీపట్నంలో జోరుగా గంజాయి దందా సాగుతుందని పోలీసులకు సమాచారం రావడంతో.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జగన్నాథపురంలో ఉన్న
చిన్నా - పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. దాని వల్ల కలిగే అనర్థాలను గ్రహించకుండా.. తాత్కాలిక ఆనందం కోసం వాటికి అలవాటుపడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ గంజాయి, డ్రగ్స్ దందా పెరిగిపోతోంది. తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని అణచివేసేలా రాష్ట్ర పోలీస్ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఏపీలోనూ గంజాయి దందాపై పోలీస్ విభాగం దృష్టి సారించింది. వారికి వస్తున్న సమాచారాల మేరకు దాడులు నిర్వహించి, నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. నిన్న గుడ్లవల్లేరులో బ్యూటీషియన్ ముసుగులో గంజాయి అమ్ముతున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా.. మచిలీపట్నంలో జోరుగా గంజాయి దందా సాగుతుందని పోలీసులకు సమాచారం రావడంతో.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జగన్నాథపురంలో ఉన్న ఓ రైస్ మిల్లు వెనుక ఉన్న ఖాళీ స్థలంలో విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసుల కళ్లకు చిక్కారు. పోలీసుల రాకను గమనించిన విద్యార్థులు అప్రమత్తమై పరారవ్వగా.. ఎస్సై అనూష వారిని వెంబడించి ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విద్యార్థిని విచారించి.. మిగతా వారి వివరాలను కూడా సేకరించి వారిని అదుపులోకి తీసుకుంటామని, వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాలను కూడా తెలుసుకుంటామని ఎస్సై అనూష పేర్కొన్నారు.
Next Story