Tue Jan 20 2026 09:28:11 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేయసి మోసం చేయడంతో.. యువకుడి ఆత్మహత్య
ప్రేయసి మోసం చేయడంతో.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం

ప్రేయసి మోసం చేయడంతో.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో వెలుగుచూసింది. వివరాలు పరిశీలిస్తే.. కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు కొంతకాలం ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ.. అంతలోనే ఆ అమ్మాయి శంకర్ కు హ్యాండ్ ఇచ్చింది. మరొకరితో పెళ్లికి సిద్ధమైంది.
Also Read : ఫిబ్రవరి ఒకటి నుంచి స్కూళ్లు ప్రారంభం
ప్రేమ పేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని మోసం చేసిందంటూ శంకర్ రావు సెల్ఫీ వీడియోలో వాపోయాడు. తనను ప్రేమించి, అన్నిరకాలుగా వాడుకుని ఇప్పుడు మరొకరితో పెళ్లికి రెడీ అయిందని, ఆమె చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శంకరరావు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి.. తన ఆత్మహత్య సెల్ఫీ వీడియో, ఆ అమ్మాయితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేశాడు. కాగా.. సదరు యువకుడికి గతంలోనే పెళ్లికాగా.. వారిద్దరూ విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story

