Tue Jan 20 2026 11:20:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫిబ్రవరి ఒకటి నుంచి స్కూళ్లు ప్రారంభం
లంగాణలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల 31వ తేదీ వరకూ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడతో తిరిగి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించారు.
కసరత్తు చేసిన తర్వాత...
ఇప్పటి వరకూ 8,9,10 తరగతులకు కూడా ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు. సెలవులు ముగియనుండటంతో విద్యాశాఖ స్కూళ్లను ప్రారంభించడం పై కసరత్తు చేసింది. వైద్య ఆరోగ్య శాఖతో కూడా సంప్రదింపులు జరిపారు. విద్యాసంవత్సరం కోల్పోకుండా వెంటనే స్కూళ్లను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
Next Story

