Fri Dec 05 2025 19:37:32 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
ఫిబ్రవరి 16వ ఉదయాస్తమ సేవా టికెట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు కోటిరూపాయల

తిరుపతిలోని ఏడుకొండలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు వెల్లడించారు జవహర్ రెడ్డి. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 16వ ఉదయాస్తమ సేవా టికెట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు కోటిరూపాయల విరాళం ఇచ్చినవారికి ఈ టికెట్లను జారీ చేస్తామని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా విరాళమిచ్చిన భక్తులకు ఉదయాస్తమయ సేవా టికెట్లను జారీ చేస్తామని... ఈ టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ జారీ చేస్తామని చెప్పారు.
Next Story

