Sat Aug 13 2022 07:05:05 GMT+0000 (Coordinated Universal Time)
ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది : మంత్రిపేర్ని నాని

టాలీవుడ్ అగ్రహీరోలు, ఇతర ప్రముఖులు నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణమూర్తి, అలీ, పోసాని తదితరులు జగన్ తో సమావేశమై సినిమా వాళ్ల సమస్యలు, ఏపీలో సినిమా టికెట్ల రేట్ల గురించి చర్చించారు. ఈ భేటీ అనంతరం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అలాగే సినీ పరిశ్రమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చేందుకు చిరంజీవి ఎంతో కృషి చేశారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏపీలో కూడా షూటింగులు జరపాలని సినీ ప్రముఖులను జగన్ కోరారని పేర్ని నాని తెలిపారు. విశాఖలో షూటింగులకు అనుకూలంగా చాలా ప్రాంతాలుండగా.. అక్కడ షూటింగులు జరిగేలా చూడాలని సీఎం జగన్ సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయం చేసేందుకైనా సిద్ధమని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు మాట్లాడుతూ.. తమకు హైదరాబాద్ ఎంతో.. ఏపీ కూడా అంతేనని చెప్పారని, వారికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పేర్నినాని.
Next Story