Sat Mar 07 2026 20:33:57 GMT+0530 (India Standard Time)
కొడాలి, వంగవీటికి కరోనా పాజిటివ్
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది.

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా సోకింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొడాలి నాని ఇటీవల గుడివాడలో ఎన్టీఆర్ - వైఎస్సార్ ఎడ్ల పోటీలు సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల నుంచి ఆయన అక్కడ కన్పించకపోవడంతో ఆరా తీయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
స్వల్ప లక్షణాలే....
మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా సయితం కరోనా బారిన పడ్డారు. ఆయన కూడా ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్సం పొందుతున్నారు. ఇద్దరికీ స్వల్ప లక్షణాలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
Next Story

