హోలీ సరదా... ప్రాణం తీసింది

Update: 2017-03-16 09:00 GMT

హొలీ రొజున రంగు నీళ్లు అనుకుని ప్రమాదరకమైన కెమికల్ ను శరీరం మీద పోసుకోవడంతో ఒక యువకుడు చనిపొయాడు. హొలీ రొజున తన ఇంటి పక్కనే ఉన్న మరదలితో హొలీ ఆడుతున్నాడు చందు.. నాగర్ కర్నూల్ కు చెందినచందు గత కొంత కాలంగా హైదరబాద్ లోని సింగరేణి కాలనీ లో నివాసం వుంటున్నాడు.బిటెక్ ఫైనల్ ఇయర్ చదివిన చందు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ వుంటున్నాడు. హోలీ రొజున తన ఇంటిపక్కన ఉన్నమరదలితో హోలీ అడుతున్నాడు. మరదలు చూసుకోకుండా తన ఇంటిలో ఒక డబ్బాలో వున్న కెమికల్ ను చందు మీద పోసింది.అప్పటికే చందు కట్టెలపొయ్యి పక్కనే వున్నాడు.. చందుపైన కెమికల్ పడడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి.. చికిత్సనిమిత్తం చందును ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు..కొన్నిరొజులుగా చికిత్స పొందుతూ చందు మరణించాడు..చందు మరణానికి మరదలే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందొళన చేశారు..ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణచేస్తున్నారు..

Similar News