హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తాం : కేటీఆర్

Update: 2017-01-17 14:40 GMT

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రధానంగా నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ అభివృద్ధిపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. క్లీన్ సిటీగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకుపోతుందన్నారు. ఇక నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణపైనా దృష్టి పెట్టామన్నారు.

కొందరు కావాలని విమర్శలు చేస్తే ఏమీ చేయలేమని, రెండున్నరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తూనే ఉందన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్, ఎమ్మార్ ప్రాపర్టీస్ ఆక్రమణల తొలగింపుపై టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వాళ్ల నేత పరాయి రాష్ట్రం వెళ్లినా....ఇక్కడ మాత్రం పరాయి రాష్ట్రం మాటలు మాట్లాడుతోందని చమత్కరించారు. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పారు.

Similar News