హైకోర్టులో ఏపీకి చుక్కెదురు

Update: 2017-08-17 13:26 GMT

హైకోర్టు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు చుక్కెదురయింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జరుపుతున్న భూసేకరణ పై హైకోర్టు స్టే విధించింది. NHAI 1956 యాక్ట్ కింద పోరంకి నుండి మచిలీపట్నం హైవే లో 2009 లో భూసేకరణ జరిపి వారికి ఇంతవరకు ఎలాంటి పరిహారం చెల్లిచలేదని 72 మంది పిటిషనర్లు హైకోర్టు ను ఆశ్రయించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం భూ నిర్వాసితులకు నష్ట పరిహార చెల్లించాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టు ను కోరారు.సుమారు 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అన్యాయం గా అక్కడున్న ఇళ్లన్నీ తొలగించారన్న పిటిషనర్ పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి డిమాలిజేషన్, డిస్పోజేషన్ యాక్టీవీటిని జరపొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భూసేకరణ కు సంబంధించిన రికార్డులన్ని సెప్టెంబర్ 5వ తేదీన నేషనల్ హైవేస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5 కు వాయిదా వేసింది.

Similar News