సోమూ...అంతేనంటారా?

Update: 2018-03-30 08:23 GMT

చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ మరోసారి విరుచుకుపడింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉపముఖ్యమంత్రులు ఇద్దరూ ఉన్నా లేనట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన శాఖ అయిన రెవెన్యూలో ఒక్క ఫైల్ ను కూడా క్లియర్ చేయలేరన్నారు. కనీసం ఆర్డీవోను కూడా కేఈ బదిలీ చేయలేరన్నారు. అలాగే మరో ఎమ్మెల్యే అనధికార హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా హోమంత్రి, ఉప ముఖ్యమంత్రి చినరాజప్పపై సెటైర్ వేశారు. చంద్రబాబు కేంద్రంపై దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కాని కేంద్రం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని సోము వీర్రాజు చెప్పారు. రైల్వేజోన్, దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సోము వీర్రాజు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతోందని చెప్పారు.

Similar News