సుష్మాకే మా ఓటు

Update: 2018-03-27 10:07 GMT

కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లయింది. ఇరాక్ లోని మోసుల్ లో 39 మంది భారతీయులను ఐసిస్ హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ల మృతి విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దాచిపెట్టారని, వారిని తిరిగి రప్పించడంలో సుష్మావిఫలమయ్యారంటూ కాంగ్రెస్ ట్విటర్లో ఒక పోల్ నిర్వహించింది. 39 మంది భారతీయులను వెనక్కు తీసుకురావడంలో విదేశాంగశాఖ మంత్రి ఫెయిలయ్యారని మీరు భావిస్తున్నారా? అని కాంగ్రెస్ పోల్ నిర్వహించగా అది సంచలనంగా మారింది. సుష్మాకు అనుకూలంగా నెటిజెన్లు మద్దతు పలుకుతుండటంతో కాంగ్రెస్ ఆ ట్వీట్ ను తొలగిచింది.

కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో....

అయితే అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయింది. దీంతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. దీనికి సబంధించి సుష్మాస్వరాజ్ విఫలం కాలేదంటూ 76 శాతం మంది, విఫలమయ్యారని 24 శాతం మంది పోల్ లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎక్కుమంది నెటిజెన్లు సుష్మాకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ తీరును కొందరు తప్పు పట్టారు. కాంగ్రెస్ ట్విట్టర్లో పెట్టిన 24 నిమిషాల్లోనే 29000 ఓట్లు పోలవ్వగా అందులో సుష్మాకు అనుకూలంగానే ఓట్లు రావడం విశేషం. దీంతో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News