శ్రీవారూ లెక్కలు చెప్పాలా?

Update: 2016-12-21 07:30 GMT

తిరుమల వేంకటేశ్వరుడికీ నోట్ల రద్దు ఇబ్బందులు తప్పేట్లు లేవు, ఆర్బీఐ నిబంధనలతో టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ హుండీలో భక్తులు వేసిన కానుకల్లో 90 లక్షలు పాతనోట్లు ఉన్నాయి. వీటిని డిపాజిట్ చేసేందుకు టీటీడీ అధికారులు బ్యాంకు కు వెళ్లారు. ఒకేసారి అంతమొత్తం డిపాజిట్ చేయడానికి వీలుకాదని....ఆర్బీఐ నిబంధలు అంగీకరించవని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో టీటీడీ అధికారులు కంగుతిన్నారు. కాని వారికి ఓ వరమిచ్చారు బ్యాంకు అధికారులు. డిసెంబర్ 30 న హుండీలో వచ్చిన పాతనోట్లన్నింటినీ ఒకేసారి వేయమని సూచించడంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంత సొమ్ము ఎక్కడదన్న ప్రశ్న గోవిందుడికీ ఎదురుకావచ్చేమో....ఆర్బీఐ నిబంధనలు అలా ఉన్నాయి మరి. తిరుమల వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది స్వామి వారి హుండీల్లో రద్దయిన నోట్లనే కానుకలుగా సమర్పిస్తున్నారు. రెండు వేల నోట్లు అతి తక్కువగా కనపడుతున్నాయి. ఇక వంద నోట్లు అత్యల్పంగా ఉన్నాయి. చిల్లర మాత్రం బాగానే వస్తుంది. కోట్లలో హుండీ ఆదాయం వస్తున్నా ఎక్కువ శాతం రద్దయిన నోట్లే వస్తుడటంతో టీటీడీ ఆందోళన చెందుతోంది.

Similar News