శ్రీదేవిని కడసారి చూసేందుకు

Update: 2018-02-28 03:23 GMT

అందాల తార శ్రీదేవి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం శ్రీదేవి నివాసమైన లోఖండ్ వాలా సెవెన్ ఏకర్స్ లో భౌతిక కాయాన్ని ఉంచారు. శ్రీదేవిని చివరిసారిగా చూసేందుకు వేలాది మంది అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. శ్రీదేవి నివాసం వద్ద కిలోమీటర్ల మేర క్యూలో అభిమానులు వేచి ఉన్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు అభిమానుల సందర్శనార్థం సెలబ్రేషన్స్ క్లబ్ దగ్గర శ్రీదేవి పార్థీవదేహాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పవన్ హన్స్ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి.

శోకసంద్రంలో ముంబయి.....

ఇప్పటికే బాలివుడ్, టాలివుడ్, కోలివుడ్ కు చెందిన తారలు ముంబై చేరుకున్నారు. ముంబైలో జరగనున్న శ్రీదేవి అంతిమయాత్రలో వీరు పాల్గొననున్నారు. శ్రీదేవి నివాసం, సెలబ్రేషన్స్ క్లబ్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుండటంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీదేవి భౌతిక కాయాన్ని చూసిన ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషీలు తట్టుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. శ్రీదేవిని కడసారి చూసేందుకు వేలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి తరలి రావడంతో ముంబయి నగరం శోకసంద్రంగా మారింది.

Similar News