విద్యుత్ చార్జీలు పెంచనున్న ఎపి ప్రభుత్వం!

Update: 2016-03-31 16:14 GMT

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు 2016-17 విద్యుత్‌ టారీఫ్‌లు ఏపీఈఆర్సీ చైర్మన్ భవానీ ప్రసాద్ గురువారం విడుదల చేశారు. ఏపీలో రూ.216కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెరుగనున్నట్లు తెలిపారు. మొదట రూ. 783 కోట్లు పెంచాలని ఈఆర్సీ ప్రతిపాదించినప్పటికీ రూ.216కోట్లకే పరిమితం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో గృహ వినియోగదారులపై భారం ఉండదని.... రేపటి నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నట్లు ప్రకటించారు. విద్యుత్ చార్జీల పెంపుతో 96.60 శాతం ప్రజలపై భారంలేదన్నారు. పరిశ్రమలకు 2 శాతం మేర పెంపు ఉంటుందని తెలిపారు. అలాగే గృహవినియోగదారుల ఏపీఈఆర్సీ మూడు గ్రూపులుగా విభజించింది. ఏడాదికి 900 లోపు వాడుకుంటే ఏ-గ్రూప్, 2700 వరకు బి-గ్రూప్, ఆపైన సి-గ్రూప్‌గా విభజించింది. ఏ-గ్రూప్‌లో 50 యూనిట్లలోపు రూ.1.45, 51 నుంచి 100 వరకు రూ.2.60 వరకు చార్జీలు పెరుగనున్నాయి.

Similar News