లోక్ సభను కుదిపేసిన మహారాష్ట్ర అల్లర్లు ...!

Update: 2018-01-04 01:54 GMT

మహారాష్ట్ర అల్లర్లు లోక్ సభను కుదిపేశాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా దళితులపై దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దాల్చడాన్ని విపక్ష కాంగ్రెస్ దుయ్యబట్టింది. కాంగ్రెస్ పార్లమెంటరీ నేత మల్లిఖార్జున ఖర్గే లోక్ సభలో మహారాష్ట్ర అల్లర్లపై చెలరేగిపోయారు. ఈ పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మల్లిఖార్జున డిమాండ్ చేశారు. తక్షణం తాజా దాడులపై ప్రధాని మోడీ ఒక ప్రకటన చేయాలని బాధితులకు న్యాయం చేయాలని కోరింది కాంగ్రెస్.

కాంగ్రెస్ విభజించి పాలించాలని చేస్తుందన్న బిజెపి ...

బ్రిటిష్ పాలకుల్లాగే కాంగ్రెస్ పార్టీ కులాల నడుమ చిచ్చు పెడుతుందని బిజెపి ఆరోపించింది. మహారాష్ట్రలో పరిస్థితులు అదుపులోనికి తెచ్చామని బిజెపి కౌంటర్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలను ప్రజలు అర్ధం చేసుకోవాలని కమలనాధులు పార్లమెంట్ వేదికగా విపక్షం విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ నేతలపై బిజెపి ఎదురుదాడికి దిగడంతో స్పీకర్ సభను వాయిదా వేయాలిసి వచ్చింది. మహారాష్ట్ర లో అన్ని చర్యలు సమర్ధవంతంగా తీసుకున్నామని అధికారపార్టీ సమాధానం ఇచ్చినా విపక్షం చల్లారలేదు.

Similar News