రోజా ని అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వని మార్షల్స్!

Update: 2016-03-18 15:30 GMT

వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై ప్రతిపక్ష నేత జగన్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోజా తరపు న్యాయవాదులను లోనికి పంపించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదులను తన వాహనంలో తీసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్దే జగన్‌ వాహన శ్రేణిని అడ్డుకున్నారు. న్యాయవాదులు అసెంబ్లీలోకి వచ్చేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో తన కార్యాలయానికి ఎవరైనా వచ్చేందుకు అనుమతి ఉందని జగన్‌ తెలపడంతో కొద్ది సేపు వైసీపీ ఎమ్మెల్యేలకు, పోలీసులకు వాగ్వివాదం నెలకొంది. ఈ సందర్భంగా జగన్ అక్కడ తనను అడ్డుకున్న పోలీసుల వివరాలు నోట్ చేసుకున్నారు. తనను అడ్డుకుంటే ఇబ్బంది పడతారని… రోజాను లోనికి అనుమతించకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పినా వారు వినకపోవడంతో సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చే ఉద్దేశంతో వారి పేర్లు, వివరాలు నోట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తొలుత అసెంబ్లీకి చేరుకున్న వైకాపా ఎమ్మెల్యే రోజాను లోనికి రానివ్వకుండా మహిళా మార్షల్స్‌ అడ్డుకున్నారు. రోజాను అడ్డుకోవడంతో ఆమె మార్షల్స్‌తో వాగ్వివాదానికి దిగారు. స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నామని మార్సల్స్ ఆమెకు చెప్పారు. అయితే… జగన్ రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోనికి తీసుకెళ్లారు. కానీ, అసెంబ్లీలోనికి మాత్రం ఆమెను అనుమతించకపోవడంతో అక్కడే ఉండిపోయారు.

Similar News