రుణాల చెల్లింపునకు వెసులుబాటు ఇస్తే భేష్!

Update: 2016-11-16 21:00 GMT

నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ కొన్ని కొత్త అంశాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని కష్టాలను చక్కబెట్టడానికి ప్రభుత్వం తన వంతుగా చేయగలిగిన నిబంధనల సవరణతో ముందుకు వస్తూనే ఉంది. నల్లకుబేరులు అనుకునే వారినుంచి.. సంపదల శ్రేణిలో చిట్టచివరన ఉండగల క్షేత్రస్థాయిలోని సామాన్యుడి వరకు ఈ నోట్ల రద్దు దెబ్బకు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఏదో ఒక స్థాయిలో నష్టపోతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు బడాబాబులు 7 వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేయడమూ సామాన్యులకు షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రజలు కొత్త అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. రద్దయిన నోట్లతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద తాము తీసుకున్న రుణాలు ఉన్నట్లయితే ఒక్కసారిగా వాటిని తిరిగి చెల్లించుకునే వెసులుబాటు ఇవ్వాలని, ఆ రుణాల చెల్లింపునకు ఇచ్చే మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ పరిశీలన పరిదిలోకి తీసుకోకుండా ఉండాలని వారు కోరుతున్నారు.

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న మొత్తాన్ని ఇప్పుడు తిరిగి చెల్లించే వెసులుబాటు ఇచ్చినా సరే.. ఆర్బీఐ చెబుతున్న పరిమితికి మించి.. బ్యాంకు ఖాతాల్లో వేసుకోవడానికి అన్ అకౌంటెడ్ డబ్బు కలిగి ఉన్న చాలా మందికి ఇది ప్రత్యేకమైన వెసులుబాటు అవుతుంది. ఈ వెసులుబాటు ఇచ్చినా సరే.. అది లెక్కల్లో లేని పెద్ద పొదుపులను కలిగి ఉండే వారికి సౌకర్యంగా పరిగణించాలే తప్ప.. అదేమీ నల్ల కుబేరులకు కల్పించే వెసులుబాటు కాబోదని జనం కోరుతున్నారు.

ప్రభుత్వం , మోదా సర్కారు సానుభూతితో స్పందించి.. ప్రజలు జీహెచ్ఎంసీ పన్ను బకాయిలు, రెగ్యులరైజేషన్ మొత్తాలు గట్రా చెల్లించిన రీతిలోనే బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో అధికారికంగా కలిగి ఉండే యావత్ రుణాలను రద్దయిన నోట్లతో ఒకేసారి చెల్లించే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని జనం కోరుకుంటున్నారు.

Similar News