రాష్ట్ర విభజనపై పిటిషన్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు

Update: 2017-01-16 10:58 GMT

ఉమ్మడి రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజుతో సహా మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దీనిపై అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటూ దాదాపు 26 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో రాష్ఠ్ర విభజన జరిగిన సంగతి తెలిసిందే.

Similar News