రవితేజా... నీకిది తగునా?

Update: 2017-06-26 13:46 GMT

సొంత సోదరుడి చితి మంటలు ఆరకముందే సినీహీరో రవితేజ షూటింగ్ లో పాల్గొనడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో రవితేజ నటిస్తున్న రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ లో ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. రవితేజ సోదరుడు భరత్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. భరత్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులెవరూ హాజరుకాకవపోవడాన్నే అందరూ తప్పుపట్టారు. అయితే ఛిద్రమైన తన సోదరుడి మృత దేహాన్ని చూడలేకపోయినందునే రాలేక పోయానని రవితేజ వివరణ ఇచ్చుకున్నారు. అయితే భరత్ మృతి చెంది 24 గంటలు గడవక ముందే షూటింగ్ లో పాల్గొనడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమ్ముడి మరణాన్ని మర్చిపోవడానికే తాను షూటింగ్ లో పాల్గొన్నట్లు రవితేజ వివరణ ఇచ్చుకుంటున్నారు.

Similar News