యువతి బాత్రూంలోఉండగా వీడియో తీసి....!

Update: 2017-12-10 03:05 GMT

హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్స్ అక్రమాలకు అడ్డాగా మారింది. లేడిస్ హాస్టల్ లో సెక్యూరిటి లేకుండా పొయింది. అమ్మాయిలు అభద్రత తో బతుకవలసి పరిస్థితి.. బతుకు దెరువు కోసం , చదువు కోసం వచ్చిన యువతులకు రక్షణ లేకుండా పోయింది. కూకట్ పల్లిలోని ఒక లేడీస్ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ యాజమాని కూమారుడే స్వయంగా అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నాడు.

హాస్టల్ యజమాని కుమారుడే....

హైదరాబాద్ లో హాస్టల్స్ సంస్కృతి విపరీతంగా పెరిగింది. పొట్ట కూటి కోసం కొందరైతే.. చదువు కోసం తప్పనిసరిగా లేడీస్ హైదరాబాద్ కు వస్తున్నారు. సింగిల్ గా అద్దె కు వుండాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అయితే హాస్టల్స్ లో వుంటే సేఫ్‌ తో పాటుగా సెక్యూరిటి వుంటుందని తల్లిదండ్రులు అనుకుంటారు. ఇక్కడ జరుగుతుంది మరోలా వుంటుంది. ఎందుకంటే ఈ హాస్టల్స్ మొత్తం కూడా ఇన్ సెక్యూరిటికి అనవాళ్లుగా మారిన్నాయి. హాస్టల్స్ దొంగతనాలు కామన్ అయిపొయాయి. దీనికి తోడుగా లైగింక వేధింపులు కూడా సర్వసాధారణం.. డబ్బులు తీసుకుని కూడా సరియైన ఏర్పాట్లు చేయక పొవడం కూడా వుంటున్నాయి. దీనికి భిన్నంగా ఇప్పడు మరొక సంఘటన జరిగింది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు లోని లక్ష్మి హాస్టల్ ఉంది. విజయవాడ నుంచి వచ్చిన ఒక యువతి హాస్టల్ లో వుంటూ స్టాప్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే హాస్టల్ యాజమాని కూమారుడి బుద్ధి వక్రంగా వుంది .. అమ్మాయి స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీశాడు. తీసిన వీడియోలను తన ఫ్రెండ్స్ కు అప్ లోడ్ చేశాడు. ఈ వీడియోలు కాస్తా అమ్మాయి వద్దకే వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన అమ్మాయి వెంటనే రివర్స్ విచారణ చేసింది. దీంతొ ఈ వీడియో హాస్టల్ యాజమాని కూమరుడు చంద్రహాస్ తీసి పంపినట్లుగా తేలింది. దీంతో అతన్ని నిలదీయగా తనకు ఏమి తెలియదని చెప్పాడు. దీంతో సదరు యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది . పోలీసులు చంద్రహాస్ ను పట్టుకుని తమ దైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం చెప్పాడు. కొన్ని రొజుల క్రితం తాను ఉద్దేశ^పూర్వకంగానే ఈ అమ్మాయి స్నానం చేస్తున్నప్పడు వీడియోలు తీసి తన ప్రెండ్స్ కు షేర్ చేశానని చెప్పాడు. దీంతొ చంద్రహాస్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Similar News