యాభై కోట్ల డ్రగ్స్ ను కుక్క పట్టేసిందే...!

Update: 2018-01-13 13:07 GMT

డ్రగ్స్ మాఫియా నానాటికి తెలివి మీరి పొతుంది. డ్రగ్స్ రవాణాకు కొత్త కొత్త పద్దతులను ఎంచుకుంటుంది. ఎప్పడు ఎవరు ఉహించని రీతిలో డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఇప్పటి వరకు పట్టుకున్న వాటికంటే చాల డిఫరెంట్ గా ఈ మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న తీరు ఇది.. ఒక కారులో వీటిని సరఫరా చేస్తున్నారు. ఈ కారును ఎవరు తనీఖీ చేసినా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినట్లుగా కనబడవు. అంతేగాకుండా ఇందులో వున్న వారు కూడా చాలా బడా బాబులుగా కనబడతారు.

బెంగళూరుకు చెందిన ముఠా....

బెంగుళురుకు చెందిన ముగ్గురు ముఠా .. మహారాష్ట్రలో నిషేధిత మాండ్రాక్స్ ను తయారీ చేయించారు. ఈ మాండ్రాక్స్ ను అక్కడి ఫార్మా కంపెనీలో తయారీ చేయించారు.. ఇలా తయారు చేసిన మాండ్రాక్స్ ను రవాణా చేయడానికి వీళ్లు కొత్త పంధాను ఎంచుకున్నారు. ఎలా తీసుకుని పొయినా కూడా అధికారులు పట్టుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక కారును కొనుగొలు చేశారు. ఈ కారులో బ్యానెట్ తో పాటుగా మిగతా ప్రాంతాల్లో చిన్న చిన్న అరలను తయారు చేయించారు. ఈ అరల్లో కిలో చొప్పున డ్రగ్స్ పట్టేంతగా తయారు చేయించారు. ఈ గదుల పైన మళ్లీ ఐరన్ తో షీట్ తయారీ చేయించి దాని మీద కార్పెట్ వేశారు.

ప్రత్యేకంగా కారు తయారు చేయించి....

ఇలా తయారీ చేసిన కారులో మొత్తం 46 కెజీల మాండ్రాక్స్ కిలో చొప్పున ప్యాకెట్లు తయారీ చేసి ఈ సీక్రెట్ గదుల్లో పెట్టారు. ముంబాయ్ లో ఈ కారు బయలు దేరింది.. మహారాష్ట్ర నుంచి చైన్నయ్ కి ఈ డ్రగ్స్ తీసుకుని పొవాలంటే చాల చోట్ల చెక్ పొస్టులున్నాయి. దీనికి తొడుగా నిఘా కూడా బాగా వుందని ఆలొచించిన మాఫియా దీంతొ వెంటనే హైదరబాద్ మీదుగా ఈ డ్రగ్స్ బయటికి తరలించాలని ప్లాన్ చేశారు. అయితే డైరెక్ట్ రెట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం తో సంగారెడ్డి టొల్ ఫ్లాజా వద్ద ఈ కారును అధికారులు పట్టుకున్నారు.

స్నిపర్ డాగ్స్ పట్టేశాయి....

ముందుగా కారును పట్టుకొగానే తమకుఏమీతెలియదని చెప్పారు. అధికారులను బెదరించారు.అయితే స్నిపర్ డాగ్ లను డిఅర్ ఐ అధికారుల రంగంలోకి దించారు. ఈ డాగ్స్ డ్రగ్స్ ను పసిగట్టాయి.. వెంటనే ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురిని డిఅర్ ఐ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 46 కిలో ల మాండ్రాక్స్ ను పట్టుకున్నారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో యాభై కొట్లు రూపాయల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అధికారులు కారు మొత్తాన్ని శోధించారు మరియు కారు యొక్క పక్క గోడలకు అనుబంధంగా ఉన్న 46 ప్యాకెట్లను తీశారు. ప్రతి ప్యాకెట్లో 1Kg చుట్టూ బరువున్న తెల్లటి పొడి ఉంది, ఇది నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్తో పరీక్షలు జరిపింది,

Similar News