మోడీని జగన్ కలవడంపై బీజేపీ ఏమందంటే?

Update: 2017-05-11 10:04 GMT

ప్రధాని నరేంద్రమోడీతో జగన్ భేటీ కావడాన్ని బీజేపీ సమర్ధించింది. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి సిద్ధార్థనాధ్ సింగ్ జగన్ భేటీపై స్పందించారు. ప్రధానితో ఒక ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలిసే అవకాశముంటుందని ఆయన తెలిపారు. ఒక రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేతగా జగన్ వెళ్లి మోడీని కలిశారని సిద్ధార్థ్ నాధ్ సింగ్ చెప్పారు. అంతేకాని కేసులు కోసమే కలిశారనడంలో వాస్తవం లేదన్నారు. కేసుల విషయం కోర్టులు చూసుకుంటాయని చెప్పారు. అయినా జగన్ ఒక్కరే ప్రధానిని వెళ్లి కలవలేదన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రధానిని కలిసిన సమయంలో జగన్ వెంట వైసీపీ ఎంపీలు కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానితో జగన్ భేటీపై అనవసర రాధ్ధాంతం చేయొద్దని సిద్ధార్ధనాధ్ సింగ్ కోరారు.

Similar News