మోడీది అనాలోచిత నిర్ణయం : శివసేన

Update: 2017-01-18 12:03 GMT

ప్రధాని మోడీపై శివసేన మరోసారి విరుచుకుపడింది. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని శివసేన పత్రిక సామ్నాలో ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు వద్దని అధికారులు చెబుతున్నా ప్రధాని మోడీ పెడ చెవిన పెట్టారని పేర్కొంది. కేవలం తన మాట చెల్లాలనే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అణుబాంబు కంటే శక్తివంతమైందని తన సంపాదకీయంలో పేర్కొనడం గమనార్హం.

శివసేన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను కూడా వదల్లేదు. చెవుడు, మూగ వారిని ఆర్బీఐ గవర్నర్ గా నియమించారని ఎద్దేవా చేసింది. అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రజలు బలయ్యారని, దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ సోదర పార్టీ శివసేన చేస్తున్న విమర్శలు కమలనాధుల్లో కలవరం పుట్టిస్తున్నాయి.

Similar News